పంజాబ్‌లో దాదాపు 105 కిలోల డ్రగ్స్ పట్టుబడ్డాయి. పాకిస్థాన్ నుంచి భారత్‌కు జలమార్గంలో తరలిస్తుండగా పోలీసులు ఆ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న స్మగ్లర్ల వద్ద రబ్బరు ట్యూబ్స్, తుపాకులు, 105 కిలోల హెరాయిన్, 31.93 కేజీల కెఫిన్ అన్‌హైడ్రస్, 17 కేజీల డీఎంఆర్ ఉన్నట్లు గుర్తించామని పంజాబ్ పోలీసులు తెలిపారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ అంతర్జాతీయంగా వందల కోట్లు ఉంటుందని అంచనా.