AP: ఉపాధి హామీ పనులపై సచివాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులతో సమీక్షించారు. పనుల నాణ్యత విషయంలో రాజీపడవద్దని అధికారులకు చెప్పారు. వైసీపీ హయాంలోలాగా పంచాయతీ నిధులను పక్కదారి పట్టించవద్దని హెచ్చరించారు. ప్రతి దశలో పనుల నాణ్యతా ప్రమాణాలను తనిఖీ చేయాలని తెలిపారు. ఉపాధి హామీ నిధులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.