W.G: పాలకొల్లు ఎఎస్ఎన్ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం ప్రాంగణ ఎంపికలు నిర్వహించారు. వివిధ బహుళ జాతి సంస్థలకు చెందిన 18 కంపెనీలు ప్రాంగణ ఎంపికలలో విద్యార్థులను వారి ప్రతిభ, నైపుణ్యాలను పరీక్షించి ఎంపిక చేశారు. కళాశాల ప్రిన్సిపల్ రాజరాజేశ్వరి అధ్యక్షత జరిగిన ప్రాంగణ ఎంపికలో 305 మంది విద్యార్థులు పాల్గొనగా.. 145 మంది ఉద్యోగాలు పొందారు.