కృష్ణా: నూజివీడు మండలం పోతురెడ్డిపల్లి గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు కొండా ప్రశాంతి, రాంబాబుల మృతి గ్రామంలో విషాదాన్ని నింపింది. పశువులను మేత కోసం తోలుకు వెళ్లిన ప్రశాంతి, రాంబాబు దంపతులు కుంపిని చెరువులో ప్రమాదవశాత్తు పడి శనివారం మృతి చెందిన సంఘటన పాఠకులకు విధితమే. చెరువులో ఉన్న ఊబిలో ఇరుక్కుపోవడం వలన ప్రమాదం సంభవించిందని స్థానికులు తెలిపారు.