TG: బీసీ కమిషన్ రేపటి నుంచి జిల్లాల్లో పర్యటించనుంది. స్థానిక సంస్థల్లో జనాభా ప్రాతిపదికన కల్పించాల్సిన రిజర్వేషన్లపై బహిరంగ విచారణ చేపట్టనుంది. రిజర్వేషన్ల ఖరారుకు సామాజిక, ఆర్థిక, విద్య, కుల సర్వే, ప్రజల నుంచి అభ్యర్థనలు స్వీకరించనుంది. ఈ నెల 28 నుంచి వచ్చే నెల 13 వరకు ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో విచారణ జరపనుంది. కాగా, రేపు ఆదిలాబాద్ జిల్లాలో ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు సర్వే నిర్వహించనుంది.