ASR: గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా జీసీసీ ఉద్యోగులు అంకితభావంతో పనిచేయాలని అరకు ఎంపీ డాక్టర్ తనూజారాణి కోరారు. శనివారం గిరిజన సహకార సంస్థ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా జీసీసీ ప్రధాన కార్యాలయాన్ని ఎంపీ సందర్శించారు. అనంతరం జీసీసీ ఎండీ కల్పనా కుమారితో సమావేశమయ్యారు. గిరిజనులను దళారీ వ్యవస్థ నుంచి కాపాడాలని అన్నారు. గిరిజనులకు జీవనోపాధి కల్పించాలని కోరారు.