అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శింగనమల మండలం నాయనపల్లి క్రాస్ వద్ద లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. అతి వేగంతో లారీ కిందకు కారు దూసుకెళ్లి నుజ్జునుజ్జయింది. మృతులు అనంతపురం ఇస్కాన్ టెంపుల్ కు చెందిన భక్తులుగా గుర్తించారు. తాడిపత్రిలో నగర కీర్తన వేడుకలో పాల్గొని వస్తుండగా ప్రమాదం జరిగింది.