KMM: ఖమ్మం కలెక్టర్ అనుదీప్ బదిలీపై వెళ్తున్న నేపథ్యంలో ఆయన ప్రవేశపెట్టిన ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులపై ఆయన చూపిన శ్రద్ధ వేలాది మంది చిన్నారులను ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడేలా మార్చింది. ఒక అధికారిగా ఆయన బదిలీ అయినా, జిల్లా విద్యావ్యవస్థలో చేసిన మార్పులు గుర్తుండిపోతాయి.