AP: రాష్ట్రంలో భారీగా విద్యాశాఖాధికారుల బదిలీలు జరిగాయి. జిల్లా విద్యాశాఖాధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కొత్త డీఈవోలను నియమిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. అవినీతి ఆరోపణలు వచ్చినవారిని తప్పిస్తున్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడించింది.