కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో గత కొంతకాలంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. తాజాగా కెనడా ప్రతిపక్ష నేత పియర్రె పొయిలీవ్రే మాట్లాడుతూ.. ట్రూడోకి నాశనం చేయడం తప్ప బాగు చేయడం తెలియదన్నారు. దీనిపై ట్రూడో స్పందిస్తూ.. మరోసారి ప్రతిపక్ష నేత కెనడా ‘బ్రోకెనిస్ట్’ ప్లాన్లను ముందుకు తెస్తున్నారన్నారు. దీనికి ప్రతిపక్ష నేత పియర్రె స్పందిస్తూ బ్రోకెనిస్ట్ కనీసం ఇంగ్లీష్ పదం కూడా కాదు భాషను సైతం ముక్కలు చెేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు.