ASR: ఆదివాసీ రైతులకు ఐటీడీఏ ద్వారా ఐరన్ ఫెన్సింగ్ ఇప్పించాలని ఆదివాసీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మొట్టడం రాజబాబు కోరారు. ఈమేరకు గురువారం కలెక్టర్ దినేష్ కుమార్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం ఆదివాసీ రైతులు ఖరీఫ్ సీజన్లో ఒక పంట పండిస్తున్నారని తెలిపారు. పొలాల చుట్టూ ఐరన్ ఫెన్సింగ్ ఉంటే రబీ సీజన్లో కూడా రెండో పంట పండించుకునే అవకాశం ఉంటుందన్నారు.