VSP: ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు ఈనెల 30, వచ్చే నెల 6న సనత్ నగర్-సంత్రాగచ్చి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు వాల్తేర్ డివిజన్ డిసిఎం కే.సందీప్ తెలిపారు. ఈ రైళ్లు ఉదయం 6:30 గంటలకు సనత్ నగర్ నుంచి బయలుదేరి దువ్వాడ మీదుగా సంత్రాగచ్చి చేరుకుంటాయన్నారు. అలాగే తిరుగు ప్రయాణంలో ఈనెల 31న వచ్చే నెల 7న సాయంత్రం 5.25 గంటలకు సంత్రాగచ్చిలో బయలుదేరతాయన్నారు.