పుణె టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 259 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్‌కు ఓపెనర్ డెవాన్ కాన్వే మంచి స్కోరు అందించాడు. కాన్వే (76), రచిన్ రవీంద్ర (65) హాఫ్ సెంచరీలతో రాణించారు. అయితే మిగతా బ్యాటర్లు నిరాశపరిచారు. టీమిండియా బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 7 వికెట్లు పడగొట్టగా.. అశ్విన్ మూడు వికెట్లు సాధించాడు.