GVL Narasimha Rao : కన్నా కామెంట్స్ పై జీవీఎల్ రియాక్షన్…!
GVL Narasimha Rao : కన్నా లక్ష్మీ నారాయణ.. బీజేపీని వీడారు. పార్టీని వీడుతూ వీడుతూ ఆయన చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. తనకు ఇప్పటికీ మోడీ పై గౌరవం ఉందని చెబుతూనే... సోము వీర్రాజు కారణంగానే తాను పార్టీ వీడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన చేసిన కామెంట్స్ పై తాజాగా జీవీఎల్ నర్సింహారావు స్పందించారు.
కన్నా లక్ష్మీ నారాయణ.. బీజేపీని వీడారు. పార్టీని వీడుతూ వీడుతూ ఆయన చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. తనకు ఇప్పటికీ మోడీ పై గౌరవం ఉందని చెబుతూనే… సోము వీర్రాజు కారణంగానే తాను పార్టీ వీడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన చేసిన కామెంట్స్ పై తాజాగా జీవీఎల్ నర్సింహారావు స్పందించారు.
కన్నా లక్ష్మీనారాయణకు బీజేపీలో సముచిత గౌరవం ఇచ్చామని, రాష్ట్ర అధ్యక్షుడిగా, జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఆయనని పార్టీ నియమించినట్లు ఎంపీ జీవీఎల్ నరసింహా రావు పేర్కొన్నారు. బీజేపీలో అత్యంత ప్రధానమైన హోదాలు కన్నాకు కల్పించినట్లు జీవీఎల్ చెప్పారు. పార్టీ నుంచి రాజీనామా చేస్తూ సోము వీర్రాజుపై చేసిన వ్యాఖ్యలు సముచితం కాదని భావిస్తున్నామన్నారు.
కన్నా వ్యాఖ్యలు రాజకీయ దురుద్దేశమైనవన్నారు. సోము వీర్రాజు తీసుకున్న నిర్ణయాలన్నీ కేంద్ర పార్టీ అనుమతితో చేసినవేనని తెలిపారు. పార్టీలో పదవుల నుంచి ఎవరిని తొలగించినా, నియమించినా అవి ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలు, సొంతంగా తీసుకున్న నిర్ణయాలు కాదన్నారు.
పార్టీని వీడుతూ సోము వీర్రాజుపై కన్నా చేసిన వ్యాఖ్యలు సముచితం కాదన్నారు. తనపై కన్నా చేసిన వ్యాఖ్యలపై స్పందించనని జీవీఎల్ చెప్పారు. ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వారికి ఉన్నాయని, ఎంపీగా తనకు ఉన్న అవకాశాల మేరకు తాను పనిచేస్తానని చెప్పారు.