టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్ గురించి సోషల్ మీడియాలో రోజుకో వార్త హల్చల్ చేస్తుంది. బాలీవుడ్ ప్రముఖ స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ కూతురు రషా తడాని నటించబోతోందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. కానీ ఇప్పటివరకూ చిత్ర యూనిట్ మాత్రం ఈ వార్తలపై స్పందించలేదు.