స్టార్ హీరోయిన్ అనుష్క సెలెక్టీవ్‌గా సినిమాలు చేస్తున్నారు. తాజాగా ఆమె 2 సినిమాలను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. మలయాళంలో ‘కథనార్’ అనే మూవీలో అనుష్క నటిస్తోంది. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ‘ఘాటీ’ మూవీ చేస్తోంది.అయితే ఈ రెండు సినిమాల షూటింగ్ పూర్తయిందట. ప్రస్తుతం వీటి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని తెలుస్తోంది. కాగా, ఆమె చివరిసారిగా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాలో కనిపించింది.