TG: జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరిగింది. జలాశయం 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు ఇన్ ఫ్లో 74 వేల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 82,076 క్యూసెక్కులుగా ఉంది. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 318.380 మీటర్లకు చేరింది. ప్రాజెక్టుకు సంబంధించిన జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి కొనసాగుతోంది.