TG: HYD నగరవాసులకు ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు చేశారు. GHMC SRDP అభివృద్ధి పనుల్లో భాగంగా శిల్పా లేఅవుట్ ఫేజ్-2 పరిధిలో కొత్తగా ఫ్లైఓవర్‌ను నిర్మిస్తున్నారు. దీంతో నిత్యం రద్దీగా ఉండే గచ్చిబౌలి ఫ్లై ఓవర్‌ను వారం రోజులపాటు మూసివేస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. మంగళవారం నుంచి ఈనెల 28 రాత్రి 11 నుంచి ఉదయం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పేర్కొన్నారు.