KDP: వాహనదారులు ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వేంపల్లి ఎస్సై రంగారావు పేర్కొన్నారు. గురువారం ఆయన తన సిబ్బందితో కలిసి నాలుగు రోడ్ల కూడలిలో పర్యటించారు. వాహనదారులకు, దుకాణ యజమానులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. వాహనాలు ఎక్కడ బడితే అక్కడ పార్కింగ్ చేసి ట్రాఫిక్కు అంతరాయం కలిగించకూడదని హెచ్చరించారు.