AP: రాష్ట్రంలోని జాతీయ రహదారులపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టుల వారీగా నేషనల్ హైవే పనులపై సీఎం సమీక్ష జరిపారు. ఈ సమీక్షలో అధికారులు, వివిధ ప్రాజెక్టులు చేస్తున్న ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 129 ఎన్హెచ్ ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయని.. 3,300 కి.మీల మేర, రూ.76 వేల కోట్ల విలువైన ఎన్హెచ్ పనులు జరుగుతున్నాయని అధికారులు సీఎంకు తెలిపారు.