TG: ప్రతిపక్షాలు వాస్తవాలకు దగ్గరగా మాట్లాడాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ప్రజలు కూడా వాస్తవాలను గ్రహించాలని సూచించారు. పది నెలల్లో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్లు చెప్పారు. సోషల్ మీడియాపై కేటీఆర్ భారీగా ఖర్చు చేస్తున్నారని తెలిపారు. హైడ్రా, మూసీ సుందరీకరణపై బురద జల్లుతున్నారని వెల్లడించారు.