AP: ఎన్డీయే ప్రభుత్వంపై ప్రజలకు పూర్తి నమ్మకం ఉందని కేంద్రమంత్రి రామ్మోహన్ తెలిపారు. రాజధాని నుంచి ఏ ప్రాంతానికైనా రైల్వే అనుసంధానం చేయడం చాలా కీలకమని అన్నారు. పది రోజుల స్వల్ప వ్యవధిలోనే కేంద్రం ముందుకు వచ్చిందన్నారు. అమరావతి కలల ప్రాజెక్టు వాస్తవ రూపంలోకి వస్తుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు ఇది చరిత్రాత్మక రోజని పేర్కొన్నారు. ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణానికి ప్రాజెక్టులు దోహదం చేస్తాయని వెల్లడించారు.