మన్యం: ఏనుగుల దాడిలో వృద్దుడు మృతి చెందిన సంఘటన గురువారం పార్వతీపురం మండలం పెదబొండపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఈ మేరకు పార్వతీపురం రూరల్ ఎస్సై సంతోషి తెలిపిన వివరాల ప్రకారం దేవాబత్తుల యాకాబు (74) పొలం పనులు ముగించుకుని ఇంటికి వస్తుండగా ఏనుగులు దాడి చేసి చంపాయన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చెస్తున్నామన్నారు.