HYD: గడ్డి అన్నారం డివిజన్ బీజేపీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ పాటిల్‌ను కలిశారు. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలో ఉన్న పెండింగ్ అభివృద్ధి పనులు, సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు. పెండింగ్ పనులను త్వరగా ప్రారంభించి సకాలంలో పూర్తి చేయాలని కోరారు. సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయాలన్నారు.