SKLM: టెక్కలి మండలం రావివలసలో రూ.63 లక్షల నిధులతో రహదారి నిర్మాణ పనులకు కూటమి శ్రేణులతో కలిసి గురువారం రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శంకుస్థాపన చేశారు. రావివలస మల్లికార్జున స్వామి ఆలయంలో కార్తీక మాసం ఉత్సవాలకు ఏర్పాట్లు పరిశీలించేందుకు వచ్చిన మంత్రి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు.