AP: వైసీపీ అధినేత జగన్ ఇప్పటికే వైఎస్ షర్మిలకు ఆస్తులు ఇచ్చారని మాజీమంత్రి పేర్నినాని ఆరోపించారు. వ్యాపారాల్లో వచ్చే ఆదాయాల్లోనూ వాటాలు పంచారని పేర్కొన్నారు. జగన్ స్వార్జిత ఆస్తులను అఫిడవిట్లో చూపించారని చెప్పారు. జగన్ను పతనం చేయాలనే తప్పుడు ఆలోచనతోనే ఈ కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. దుర్మార్గంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.