ELR: పుట్టిన ప్రతీ బిడ్డకు పోలియో చుక్కలు వేసి, ఏ బిడ్డా పోలియో బారిన పడకుండా చూడాలని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి, ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా ఏలూరులో గురువారం పిల్లలకు ఎంపీ, కలెక్టర్లు పోలియో చుక్కలను వేశారు.