కెనడాలో ఎలాంటి సీక్రెట్ ఆపరేషన్లు చేయలేదని భారత రాయబారి సంజయ్ వర్మ తెలిపారు. ఇప్పటి వరకు కెనడా ఎలాంటి ఆధారాలను చూపలేకపోయిందన్నారు. గోల్డీ బ్రార్, లారెన్స్ బిష్ణోయ్‌లను భారత్ ఉగ్రవాదులుగా ప్రకటించినట్లు గతంలోనే కెనడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, అయినా ఉగ్రవాదుల జాబితాలో బ్రార్ పేరును కెనడా తొలగించిందని వర్మ పేర్కొన్నారు.