AP: పలు ప్రాజెక్టులకు భూసేకరణ, అటవీ, పర్యావరణ అనుమతుల సమస్యలు ఉన్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. ‘రాష్ట్రంలో 47 ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. 6 ప్రాజెక్టులు బిడ్డింగ్ స్థితిలో ఉన్నాయి. 15 ప్రాజెక్టులు నిలిచిపోయాయి. 75 ప్రాజెక్టులకు భాసేకరణ సమస్యలు. 23 ప్రాజెక్టులకు అటవీ అనుమతుల సమస్యలు ఉన్నాయి. మొత్తం 95 ప్రాజెక్టులకు వివిధ సమస్యలు ఉన్నాయి. ప్రాజెక్టులన్నింటీకీ మూడు నెలల్లో భూసేకరణ చేయాలి’ అని అధికారులకు ఆదేశించారు.