SRCL: నవంబర్ 1న కరీంనగర్ కు బీసీ కమిషన్ బృందం వస్తున్నట్లు సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల వారీగా కల్పించాల్సిన అవసరమైన రిజర్వేషన్ల దామాషాను పేర్కొనే విషయంలో ఆసక్తి కలిగిన ఆయా రాజకీయ పార్టీలు, సంఘాలు, ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు బీసీ కమిషన్ బృందం వస్తున్నట్లు పేర్కొన్నారు.