SRCL: పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా వేములవాడ పోలీస్ స్టేషన్లో విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పోలీస్ శాఖలో అమలవుతున్న అధునాతన సాంకేతిక పరిజ్ఞానం గురించి, రిసెప్షన్ విధులు, ఫింగర్ ప్రింట్, బ్లూ కోల్ట్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ సిబ్బంది, విద్యార్థులు ఫల్గున్నారు.