AP: వైసీపీ అధినేత జగన్.. ప్రభుత్వంపై దుష్ప్రచారమే పనిగా పెట్టుకున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ‘జగన్ పాలనలో మహిళలపై చాలా దాడులు జరిగాయి. YCP హయాంలో 2లక్షలకు పైగా కేసులు నమోదైతే తీసుకున్న చర్యలేవి. తన ఇంటి పక్కనే యువతిపై అత్యాచారం జరిగితే పట్టించుకోలేదు. అలాంటి జగన్ ఇవాళ శాంతిభద్రతలపై మాట్లాడటం విడ్డూరం. నేరాలను కూటమి ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేస్తోంది. దోషులకు కఠిన శిక్షలు విధిస్తున్నాం’ అని పేర్కొన్నారు.