పుణె వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ విజృంభించాడు. 23.1 ఓవర్లు బౌలింగ్ చేసి 59 పరుగులకే 7 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్ట్ కెరీర్లో ఓ ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు తీయడం సుందర్‌కు ఇదే తొలిసారి. కాగా సుందర్ ఏకంగా ఐదుగురిని బౌల్డ్ చేసి రికార్డు సృష్టించాడు. భారత్ తరఫున ఈ ఫీట్ సాధించిన ఐదో బౌలర్‌గా నిలిచాడు.