TG: కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి సన్నిహితుడు గంగారెడ్డి హత్యకు గురయ్యారు. తనను బీఆర్ఎస్ నేతలే చంపారని జీవన్ రెడ్డి అనుకుంటున్నట్లు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ వెల్లడించారు. గంగారెడ్డి హత్యకు వ్యక్తిగత కక్షలే కారణమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చేందుకు కుట్ర జరిగింది, కాంగ్రెస్కు మద్దతుగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరిక జరిగిందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతల చేరికతో కొంత ఇబ్బంది జరగడం వాస్తవమేనని తెలిపారు.