ప్రకాశం: వేటపాలెం జాతీయ రహదారి వద్ద గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చీరాల నుండి నెల్లూరుకి వెళుతున్న లారీ తోటవారిపాలెం మలుపు దగ్గరకు వచ్చే సరికి అదుపు తప్పి కాలువలోకి దూసుకు వెళ్ళింది. ఈ సమయంలో ఎటువంటి వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. లారీ స్టీరింగ్ మరమ్మత్తులకు గురవటంతో ప్రమాదం జరిగిందని డ్రైవర్ తెలిపారు.