మన్యం: ఉద్యోగులు తమ విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే సహించేది లేదని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అన్నారు. గురువారం ఆయన పార్వతీపురం మున్సిపల్ కార్యాలయంలో ఉద్యోగులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉద్యోగుల హాజరు రికార్డులను ఆయన క్షుణ్ణంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అలాగే ప్రజలకు మంజూరు చేయాల్సిన కుల, ఆదాయ, ధ్రువీకరణ పత్రాల జారీలో అలసత్వం వహించొద్దన్నారు.