VZM: పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థం రామస్వామి దేవస్థానానికి హుండీల ద్వారా రూ.28.8 లక్షలు ఆదాయం లభించినట్లు ఆలయ ఈవో వై.శ్రీనివాసరావు వెల్లడించారు. పైడితల్లి దేవస్థానం ఈవో వై.శ్రీనివాసరావు పర్యవేక్షణలో గురువారం రామస్వామి దేవస్థానం హుండీల లెక్కింపు నిర్వహించారు. ఐదు నెలల కాలానికి ఈ ఆదాయం వచ్చిందన్నారు. హుండీ లెక్కింపులో ఏపీజీవీ బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.