కోనసీమ: పి.గన్నవరం మండలంలోని లంకల గన్నవరం గ్రామంలో వృద్ధురాలిపై అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. ఆ ఘటనపై పి.గన్నవరం సీఐ భీమరాజు గురువారం విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా వృద్ధురాలు నివాసం ఉంటున్న ఇంటిని, పరిసరాలను ఆయన పరిశీలించి, పలు వివరాలు సేకరించారు. ఆయన వెంట పి.గన్నవరం ఎస్సై శివకృష్ణ, గ్రామ సర్పంచ్ పసలపూడి రామకృష్ణ ఉన్నారు.