నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని మినీ బైపాస్ వద్ద ఆక్రమణలపై గురువారం అధికారులు చర్యలు ప్రారంభించారు. నగరపాలక సంస్థ కమిషనర్ సూర్యతేజ ఆదేశాల మేరకు అన్నమయ్య సర్కిల్ వద్ద అక్రమంగా ఏర్పాటు చేసిన దుకాణాలు సిబ్బంది తొలగించారు. ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు.