ఔషధ గుణాలున్న నీలగిరి తైలాన్ని ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తారు. ఈ తైలం గాయాలను నయం చేస్తుంది. పగిలిన పాదాలు, పొడి చర్మం, జలుబు, దగ్గు వంటి సమస్యలకు ఈ తైలం మంచి పరిష్కారం. మరగబెట్టిన నీటిలో నీలగిరి ఆయిల్ని వేసి ఆవిరిపడితే జలుబు తగ్గిపోతుంది. స్నానం చేసే నీటిలో నాలుగు చుక్కలు ఈ తైలం కలిపితే ఒళ్లు నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. కొబ్బరి నూనెలో కాస్త ఈ ఆయిల్ కలిపి మసాజ్ చేసుకుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి.