SKLM: పలాస మండలం కంబ్రిగాం జంక్షన్ జాతీయ రహదారిపై గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పలాస మండలం నారాయణపురం గ్రామానికి చెందిన 10మంది మహిళా కూలీలు కాశిబుగ్గకు ఆటోలో వెళుతుండగాఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో మహిళ కూలీలతో పాటు ఆటో డ్రైవరు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కాశిబుగ్గ పోలీసులు కేసు నమోదు చేశారు.