»%e0%b0%85%e0%b0%ae%e0%b0%bf%e0%b0%a4%e0%b1%8d %e0%b0%b7%e0%b0%be%e0%b0%a8%e0%b1%81 %e0%b0%95%e0%b0%b2%e0%b0%bf%e0%b0%b8%e0%b0%bf%e0%b0%a8 Jk %e0%b0%b8%e0%b1%80%e0%b0%8e%e0%b0%82
జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. అరగంట పాటు వారిరువురు పలు విషయాలపై చర్చించారు. ఈ సమావేశంలో.. కొత్తగా ఎన్నికైన ప్రభుత్వానికి కేంద్రం పూర్తి మద్దతునిస్తుందని షా హామీ ఇచ్చారని రాజకీయ వర్గాలు తెలిపాయి. జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించే ప్రక్రియను ప్రారంభించడానికి హోంమంత్రి హామీ ఇచ్చారని కూడా తెలిపాయి.