NDL: రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారులకు సంబంధించిన అంశాలపై గురువారం సీఎం చంద్రబాబు రాష్ట్ర సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి, CMO ఉన్నతాధికారులు, నేషనల్ హైవే అధికారులు పాల్గొన్నారు. యుద్ధ ప్రతిపాదికన నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారులను పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.