గాజాలో విధులు నిర్వర్తిస్తోన్న అల్జజీరా మీడియా సంస్థకు చెందిన ఆరుగురు జర్నలిస్టులు ఉగ్రవాదులంటూ ఇజ్రాయెల్ ఆరోపణలు చేసింది. పాలస్తీనాకు చెందిన హమాస్, ఇస్లామిక్ జిహాద్ సంస్థలతో వారు కలిసిపోయారని మండిపడింది. తాజాగా వీటిపై సదరు సంస్థ స్పందిస్తూ తీవ్రంగా ఖండించింది. ఆ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. వారి వృత్తిపరమైన విధులను మాత్రమే నిర్వర్తిస్తున్నారని తెలిపింది.