ఫన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ‘లగ్గం’ మూవీ రేపు విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మహిళలకు చిత్రబృందం బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం మహిళామణుల కోసం కూకట్పల్లిలోని అర్జున్ థియేటర్లో ఇవాళ సాయంత్రం ఉచితంగా ఈ సినిమా స్పెషల్ షో వేస్తున్నారు. ఈ మేరకు మేకర్స్ పోస్టర్ షేర్ చేశారు. ఇక ఈ సినిమాకు సి రమేష్ దర్శకత్వం వహించగా.. సాయి రోనక్, ప్రగ్యా నగ్రా, రాజేంద్ర ప్రసాద్, రోహిణి కీలక పాత్రలు పోషించారు.