AP: మాజీ సీఎం జగన్ మనస్తత్వం ఏంటో మరోసారి నిరూపితమైందని కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి తులసి రెడ్డి అన్నారు. జగన్ డబ్బు కోసం తల్లినీ, చెల్లినీ కూడా దూరం పెట్టగలరని మరోసారి నిరూపించారన్నారు. కుటుంబ ఆస్తిపాస్తుల విషయంలో ఆయనకు డబ్బే ప్రధానమని ఎద్దేవా చేశారు. ఈ విషయం భవిష్యత్తులో జగన్కు రాజకీయంగా చాలా నష్టాలను తెచ్చిపెడుతుందని పేర్కొన్నారు.