జూ.ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ‘దేవర’ సినిమా భారీ విజయం అందుకుంది. తాజాగా ఈ సినిమా OTT విడుదలపై ఇంట్రెస్టింగ్ బజ్ నెలకొంది. నెట్ఫ్లిక్స్లో నవంబర్ 8 నుంచి సౌత్ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు, దీని హిందీ వెర్షన్ నవంబర్ 22న సదరు సంస్థలో రిలీజ్ కానున్నట్లు సమాచారం. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.