TG: కొల్లూరు, ఈదుల నాగులపల్లి రైల్వే బ్రిడ్జిని అభివృద్ధి చేయాలని ఎంపీ రఘునందన్ అన్నారు. దక్షిణ మధ్య రైల్వే జీఎం సమావేశంలో పాల్గొన్న ఆయన.. జర్నలిస్టులు, వికలాంగులకు రైల్వేపాస్లను పునరుద్ధరించాలని అధికారులను కోరినట్లు చెప్పారు. మనోహరాబాద్- కొత్తపల్లి రైల్వేలైన్ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేసినట్లు వెల్లడించారు.