TG: మేడ్చల్లోని బౌరంపేటలో అమానుష ఘటన చోటుచేసుకుంది. వారం రోజుల క్రితం నాలుగేళ్ల బాలికపై యోగి అనే వ్యక్తి అత్యాచారయత్నం చేశాడు. ఆ చిన్నారిని దారుణంగా కొట్టి.. ఆమె ఒంటిపై పలు చోట్ల కొరికి హింసించాడు. ప్రస్తుతం ఆ బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.