బాలీవుడ్ నటి కాజోల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను సినిమాల మధ్య విరామం ఇవ్వడంపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. చిత్రాల కంటే కుటుంబానికే తాను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. పిల్లలను చూసుకోవడం కోసమే మూవీల మధ్య గ్యాప్ ఎక్కువ తీసుకుంటానని వెల్లడించారు. జీవితంలో నటన భాగమే కానీ.. అదే జీవితం కాదని తెలిపారు.